తెలంగాణ

రాంరెడ్డికి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడు, అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని అర్థరాత్రి సమయంలో ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయానికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ జెండాకప్పి నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వగ్రామమైన కామేపల్లి మండలం పాతలింగాలకు భౌతికకాయాన్ని తరలించారు. తెల్లవారుజామునుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన సన్నిహితులు స్వగ్రామానికి చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామేపల్లి మండలంలోని గ్రామాల ప్రజలు పెద్దదిక్కు కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.