తెలంగాణ

స్టడీ సర్కిళ్లపై ప్రత్యేక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో ఎనిమిది స్టడీ సర్కిళ్లు అనధికారికంగా నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. బిఎస్‌సి (అగ్రిల్చర్), ఎంబిఎ తదితర కోర్సులను బోధిస్తున్న ఈ స్టడీసర్కిళ్లు ఇతర రాష్ట్రాలలోని మూడు వేర్వేరు విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోందన్నారు. ఈ అంశాన్ని యూజిసి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అక్రమంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు కాకుండా చూసేందుకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యకోసం వెళ్లే బిసి విద్యార్థులకు ‘మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి’ని ఏర్పాటు చేశామని బిసి సంక్షేమ మంత్రి జోగురామన్న తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, రామడుగు ప్రాజెక్టు ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.
ఆసరా పింఛన్‌ను లబ్దిదారులకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పంచాయితీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో బిందు సేద్యం సమర్థంగా నిర్వహిస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో హెయిర్ కట్టింగ్ సెలూన్లకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉన్న దుకాణాలకు సబ్సిడీ చెల్లిస్తున్నామని విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.