తెలంగాణ

1.62 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి మంగళవారం కారులో రవాణా అవుతున్న 1.62 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బచ్చన్నపేట పోలీసుస్టేషన్‌లో జనగామ డిసిపి వెంకన్న తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ ప్రధాన రహదారి వెంట గంజాయి రవాణా అవుతున్న సమాచారంతో నిఘా పెట్టారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని పైడిమాంబ కాలనీ నుంచి పచ్చిగళ్ల శ్రీనువాసు అనే డ్రైవర్ ఎపి 31 బిజె 2349 నెంబరు కారు డిక్కిలో శుద్ధిచేసిన 1.62 క్వింటాళ్ల గంజాయిని 72 ప్యాకెట్లలో తీసుకొస్తున్నాడు. యధా ప్రకారం మంగళవారం మధ్యాహ్నం బచ్చన్నపేట ఎస్సై భరత్ బృందం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కారు పోలీస్‌స్టేషన్ వద్దకు రాగానే పోలీసులు కారుపత్రాలు తనిఖీ చేస్తుండగా డ్రైవర్ శ్రీనువాసు పారిపోతుండగా ఎస్సై భరత్ వెంబడించి అతడిని పట్టుకున్నాడు. ఆ తరువాత కారు తనిఖీ చేయగా డిక్కిలో గంజాయి పొట్లాలు కనిపించాయి. గంజాయితో సహా కారు స్వాధీన పరుచుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ గంజాయి పొట్లాలను గాజువాకలో బాబు అనే వ్యక్తి తనకు అప్పగించాడని, నిజామాబాద్ వెళ్లినాక కామారెడ్డి నుంచి అలీ అనే అతను ఓ వ్యక్తిని పంపిస్తాడని, ఇది అతనికి అప్పగించాలని ఇందుకు రూ. 15వేలు ఇస్తానన్నాడని డ్రైవర్ పోలీసులకు వివరించాడు. స్థానిక తహశీల్దార్ విజయభాస్కర్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.