తెలంగాణ

ఆట మొదలు పెట్టకుండానే రనౌటయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ‘వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చాను. ఆట మొదలు పెట్టకుండానే రనౌటయ్యా’నని పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత అధికారులు తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదన్న అపవాదు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని ఆయన హితవు పలికారు. పదవీ విరమణ చేసిన ప్రదీప్ చంద్రకు ప్రభుత్వం తరఫున సచివాలయం బుధవారం విడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తనకు పదవీ కాలాన్ని పొడిగించకపోవడం పట్ల ప్రదీప్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధులైన దళిత అధికారులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వాలపైన అలాంటి అపవాదు రాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. తన 34 ఏళ్ల సర్వీసులో ఎవరికీ తలవంచకుండా, మచ్చ లేకుండా పని చేశానన్నారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా తనను నియమించినప్పుడు తనకు ఆ శాఖపై అవగాహన లేదని కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా ఆ శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చానని, వాటినే ఇప్పటికీ అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడంలో ప్రదీప్‌చంద్ర చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఎస్సీల జనాభా దామాషా ప్రకారం రుణాలు ఇచ్చేలా జీవో తీసుకొచ్చింది ప్రదీప్ చంద్రానేనని ఆయన గుర్తు చేశారు. ప్రదీప్ చంద్ర వంటి సమర్దుడైన అధికారి సేవలను పదవీ విరమణ తర్వాత కూడా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతామని కడియం శ్రీహరి అన్నారు. పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడానికి ప్రదీప్ చంద్ర ఎంతో కృషి చేశారన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర తనదైన ముద్ర వేశారన్నారు. ప్రదీప్ చంద్ర సేవలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుందని కెటిఆర్ హామీ ఇచ్చారు.
chitram...

సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను
సన్మానిస్తున్న మంత్రులు కెటిఆర్, పోచారం, కడియం తదితరులు