తెలంగాణ

‘సిఎంఆర్ బకాయిలు చెల్లించకుంటే కేసులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను వెంటనే చెల్లించని పక్షంలో పిడి చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 21 మంది రైస్ మిల్లర్ల నుంచి దాదాపు రూ.17 కోట్ల విలువ చేసే ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై ఆయన బుధవారం పౌర సరఫరాల సంస్ధ మేనేజర్లతో సమీక్షించారు. ఈ బకాయిల చెల్లింపు గడువు నిరుడు అక్టోబర్ 30వ తేదీతో ముగిసిందన్నారు. రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిందన్నారు. ఆ గడువు కూడా డిసెంబర్ 30వ తేదీతో ముగుస్తుందన్నారు. గత ఏడాదికి సిఎంఆర్ బకాయిలు రూ.482 కోట్లకు రూ. 465 కోట్లు వచ్చాయన్నారు. మిగిలిన రూ.17 కోట్లు వసూళ్లకు చర్యలు తీసుకుంటామన్నారు.