హైదరాబాద్

‘స్వచ్ఛ’ ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను కుటుంబ సభ్యులే తడి,పొడిగా వేరు చేసి ఇచ్చేందుకు ఇదివరకే నగరంలోని 22 లక్షల కుటుంబాలకు సుమారు 44లక్షల డస్ట్‌బిన్లను జిహెచ్‌ఎంసి పంపిణీ చేసినా, ఆశించిన ఫలితం దక్కకపోటవంతో తడి,పొడి చెత్తపై అవగాహన కోసం కొద్దిరోజులుగా ప్రోత్సాహాకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ వాంబే కాలనీకి చెందిన నసిమా అనే మహిళ డ్రా ద్వారా విజేతగా ఎంపిక కావటంతో ఆమెకు గద్వాల్ పట్టుచీరను, అలాగే సర్కిల్‌లోని 51 మంది స్వచ్ఛ డ్రైవర్లలో ప్రతిరోజు క్రమంగా తప్పకుండా తడి,పొడి చెత్తను వేర్వేరుగా తెచ్చి, స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లకు అందజేస్తున్న చింతల్‌మెట్‌కు చెందిన రవి అనే స్వచ్ఛ ఆటో డ్రైవర్‌కు రూ. 10వేల నదు బహుమతిని కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం అందజేశారు. దీంతో పాటు ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెంపొందించేందుకు గాను ప్రతి నెల ఇలాంటి బహుమతులను అందజేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. దీంతో పాటు నగరంలో ప్రతిరోజు పోగవుతున్న 5వేల మెట్రిక్ టన్నుల చెత్తను తడి,పొడిగా వేరు చేయటంలో వందకు వంద శాతం ఫలితాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై విద్యాశాఖ, ఎన్‌ఎస్‌ఎస్, భారత్ మిషన్, జిహెచ్‌ఎంసి అదికారులతో కమిషనర్ సుదర్ఘీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి,పొడి చెత్తను వేర్వేరు చేసే గృహిణిలు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, చెత్త సేకరించే కార్మికులకు సర్కిళ్ల వారీగా ప్రతి నెల బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. నగరంలోని 22లక్షల పై చిలుకు ఉన్న గృహాల ద్వారా డి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలను సిద్దం చేసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 14లక్షల మంది పాఠశాల విద్యార్థినీ విద్యార్థులున్నారని, వీరికి వ్యర్థ పదార్థాల నిర్వాహణ, వాటి వల్ల ఏర్పడే అనర్దాలు, తడి,పొడి చెత్తను వేరు చేయటంతో కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ప్రతి విద్యార్థి తమ ఇంటితో పాటు కుటుంబ లోని సభ్యులను ఈ అంశాలపై చైతన్యం కల్పించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.