తెలంగాణ

గ్రామీణ రోడ్లకు రూ. 4193 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, గతంలో ఎన్నడూలేని విధంగా రెండున్నర సంవత్సరాలలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.4193 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు వి.్భపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గతంలో తెలంగాణ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి పది సంవత్సరాలలో రూ.3520 కోట్లు ఖర్చు చేస్తే కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1065 పోస్టులను భర్తీ చేశామన్నారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలాంటి విద్యాప్రమాణాలు పాటించకుండా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీంతో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని సభ్యుడు పూల రవీందర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 190 గ్రామాల్లో నీటి వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.1136 కోట్లు మంజూరు చేశామని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు తెలిపారు.
190 గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థను రూరల్ వాటర్ సప్లై ద్వారా నీటి సరఫరా కోనసాగేదని, ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగు కోసం చేపడుతున్న పనులకు సంబంధించి జలమండలి ఆధ్వర్యంలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తెలిపారు.
జలమండలిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించడంతో స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి అధికారులకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయండి తప్పకుంటా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలో జలమండలిలో పనిచేస్తున్న అవినీతి అధికారుల చిట్టాను బయటపెట్టుతానని సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్, రహమత్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ పరికరాల కాలుష్యం, గనుల త్రవ్వకానికి లైసెన్స్‌లు, ఆదిలాబాద్, నిర్మల్ మొదలైన జిల్లాలో పర్యాటకాభివృద్ధి వంటి ప్రశ్నలకు మంత్రులు జోగురామన్న, కెటిఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానాలిచ్చారు.

చిత్రం..మంత్రి జూపల్లి