తెలంగాణ

త్వరలో 9వేల మంది పోలీసుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5:కొత్తగా 9041 మంది పోలీసుల నియామకం జరుపుతున్నామని, వీరికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తరువాత దశల వారీగా ఆంధ్ర పోలీసులను వెనక్కి పంపుతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
గురువారం శాసన సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో ఆంధ్ర పోలీసు అధికారు లు తెలంగాణలో పని చేస్తున్నారని, మరో 29 మంది డిఎస్‌పిలు సైతం తెలంగాణకు రానున్నారని, దీనిని అడ్డుకోవాలని అన్నారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ ఉద్యోగుల పంపకాలను కమలనాథన్ కమిటీ చూస్తోందన్నారు. విభజన తరువాత మొత్తం 10,315 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు అన్ని కేడర్లలోని 431 మంది పోలీసు సిబ్బందిని తెలంగాణ నుండి రిలీవు చేసినట్టు చెప్పారు. ఏపి, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇప్పటికీ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులకు , సంస్థలకు భద్రతల కల్పిస్తున్నట్టు చెప్పారు. పోలీసుల నియామకం పూర్తి కాగానే వీరిని రిలీవు చేయనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌లో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, హైదరాబాద్‌కు జిల్లాలకు అనుసంధానం జరుగుతుందని, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగు పడుతుందని హోంమంత్రి నాయిని తెలిపారు. ఎమ్మెల్యే జలగం వెంకటరావు పోలీసు కమ్యూనికేషన్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రి ఈ విషయం తెలిపారు.