తెలంగాణ

హక్కులను కాలరాసే చట్టాలకు ఇదే గతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 5: రాజ్యంగం కల్పిస్తున్న హక్కులకు తూట్లు పొడిచేలా పాలకులు తెచ్చే కొత్త చట్టాలన్నింటికి 123జీవోకు పట్టిన గతే పడుతుందని టి.జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. గురువారం నల్లగొండ టౌన్ హాల్‌లో కవి, గాయకుడు ఏపూరి సోమన్న సామాజిక తెలంగాణ గుండె చప్పుడు జిల్లా కమిటీ నేతృత్వంలో నిర్వహించిన ఆటపాట మాట సభకు కోదండరాం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నిర్వాసితులకు మెరుగైన పరిహారం, పునరావాసం అందించే లక్ష్యంతో 1894 చట్టాన్ని మారుస్తూ 2013లో పార్లమెంటు భూసేకరణ చట్టం తెచ్చిందని అన్నారు. 2013 చట్టంలో వెసులుబాటు ను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన భూసేకరణ పేరుతో నిర్వాసితుల హక్కులను కాలరాసేలా 123 జీవో తెచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం అసెంబ్లీలో 2013 చట్టంలో సవరణలు ప్రతిపాదించాయని, వీటన్నింటిని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తుందన్నారు. టి.జెఎసి ముందునుండి చెబుతున్నట్లుగానే హైకోర్టు 123జీవోను కొట్టివేయడం ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కుల విజయంగా ఆయన అభివర్ణించారు. అభివృద్ధి, సామాజిక అవసరాల కోసం భూసేకరణ చేసేటప్పుడు నిర్వాసితుల జీవనోపాధికి, పరిహార, పునరావాసాలకు ప్రభుత్వాలకు ప్రాధాన్యతనివ్వక తప్పదన్నారు. నిర్వాసితుల హక్కుల కోసం అడిగితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఎదురుదాడికి దిగడం అప్రజాస్వామిక పోకడకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో అభివృద్ధి సీమాంధ్ర కాంట్రాక్టర్లు, రియల్టర్లకే పరిమితమైనందునే తెలంగాణ ఉద్యమం ఉదృతమైందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సైతం తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర పాలకులకు, ప్రజలకు మధ్య ఘర్షణగా అభివర్ణించిందన్నారు. టి.జెఎసి పాత అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తూ ప్రజలు కేంద్రంగా, సామాజిక న్యాయం పునాదిగా కూడిన నూతన అభివృద్ధి నమూనాను టి.జెఎసి కోరుకుతుందని ఈ దిశగా సబ్బండ వర్గాలను కదిలిస్తుందన్నారు. తెలంగాణ సమాజంలో ఆటపాట భాగమన్నారు. ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ సాధనకు, తెలంగాణ అమరుల త్యాగం ప్రజలందరికి ఉపకరించే పాలనకు ఏపూరి సోమన్న చేపట్టిన సాంస్కృతిక ఉద్యమంతో టి.జెఎసి కలిసి సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతు సామాజిక తెలంగాణ శక్తులతో అధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందన్నారు. ఏపూ రి సోమన్న మాట్లాడుతు తెలంగాణ అమరులు ఆకాంక్షించిన సామాజిక తెలంగాణకు, సీఎం కెసిఆర్ ఎన్నికల హామీల అమలుకు తాను సామాజిక తెలంగాణ గుండె చప్పుడు పేరుతో తెలంగాణ వ్యాప్తంగా మరో సాంస్కృతిక పోరాటాన్ని పోరుగడ్డ నల్లగొండ నుండి ప్రారంభించినట్లుగా ప్రకటించారు.