తెలంగాణ

123 జీవోపై హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో భూసేకరణ కోసం 2013 చట్టాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 123 జివోను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నిలిపి వేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నదని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. లోగడ కేంద్రంలో యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పక్షాలతో చర్చించి లోతైన అధ్యయనం చేసిన తర్వాత భూసేకరణ, పునరావాస చట్టాన్ని తీసుకుని వచ్చిందని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 123 జీవోను తెచ్చి బలవంతంగా భూసేకరణ చేయడం ద్వారా రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆయన విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిణామాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.