తెలంగాణ

మహా ఒప్పందం కాదు మహా దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ఓస్..ఇంతేనా! ఈ ఒప్పందం 2012లోనే చేశాం..’ అని శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. మహా ఒప్పందం కాదు మహా దగా..అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ మహారాష్టత్రో ఒప్పందం చేసుకోవడంలో కొత్తదనం ఏమీ లేదని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి 2012 సంవత్సరం మే 5వ తేదీన మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి పృద్వీరాజ్ చౌహన్‌తో ఒప్పందం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఆ ఒప్పంద పత్రాలను, అప్పటి ఫొటోలను మీడియాకు చూపించారు. తాము 36 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేస్తే, ఈ ప్రభుత్వం 50 వేల కోట్లు పెంచి 86 వేల కోట్లకు పెంచిందని ఆయన విమర్శించారు. ఉన్నఫలంగా 50 వేల కోట్లు పెంచడం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని వారు ఆరోపించారు. కోట్లు పెంచినా ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇచ్చే స్థితి ఈ ఒప్పందంలో లేదని అన్నారు. గతంలో తాము చేసిన ఒప్పందంలోని అంశాలే 70 శాతం వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి తాము ఒప్పందం చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్టత్రో 148 మీటర్ల ఎత్తుకే ఒప్పందం చేసుకున్నారన్నారు. ఫలితంగా మన రాష్ట్రానికి కాదు మహారాష్టక్రు మంచి రోజులు, మనకు ముంచే రోజులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టత్రో చేసిన ఈ ఒప్పందంతో మంచి రోజు కాదు చీకటి రోజు అయ్యిందని విమర్శించారు. పైగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాతంత్య్రం తెచ్చినట్లు ధూం-్ధం నిర్వహించారని విమర్శించారు. మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందంలో నాలుగు మీటర్లు తగ్గించడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.