తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: విద్యుత్ వేడి, కాలుష్యంతో భూతాపం పెరిగిపోతోందని, ప్రస్తుతం మన ముందున్న కాలుష్యం సమస్యే కీలకమైందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతన్నారు. ఆదివారం లక్డికాపూల్‌లోని సువిధ సూపర్ మార్కెట్‌లో ఆయన 35కెవి సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ మిత్రలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించడం ముదావహమన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ వినియోగం తగ్గడంతోపాటు పొదుపు జరుగుతుందన్నారు. ఐజిపి సౌమ్య మిశ్రా మాట్లాడుతూ హైదరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సువిధ సూపర్ మార్కెట్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 1981 ఆగస్టు 21న ప్రారంభమైన సువిధ నెలసరి రూ. 27,000లు ఆదాయంతో నడిచేదని, ప్రస్తుతం మార్కెట్ వ్యాపారం నెలకు రూ.29 లక్షలకు చేరిందని సువిధ మార్కెట్ అధ్యక్షుడు వాజ్‌పేయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎం రమేశ్, చార్టెడ్ అకౌంటెంట్ శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సువిధ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న డిజిపి అనురాగ్ శర్మ