తెలంగాణ

సమాన హోదా.. సమాన వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సమాజంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హోదా, సమాన వేతనం కోసం మహిళలు ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో భాగస్వాములవుతున్నారని, హోదాలో వేతనాలతో లింగ సమానత్వం సాధించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశం స్వాతంత్రం సిద్ధించి 69ఏళ్లయినా ఇంకా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, హింస కొనసాగుతూనే ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు ప్రేంపావని మాట్లాడుతూ తరాలు మారుతున్నా మహిళల తల రాతలు మారడంలేదని, ఇది సమాజ అభివృద్ధికే తీరని నష్టమన్నారు. తెలంగాణ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే..కానీ చేతల ప్రభుత్వం కాదని నిరూపించుకుందన్నారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మాట్లాడుతూ విద్య, పని, ఉపాధి కల్పనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధురాలు కమలమ్మను సత్కరించారు.

నిమ్స్‌లో నర్సుల
నిరసన

హైదరాబాద్, మార్చి 8: నిమ్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నర్సులు బహిష్కరించారు. సిబ్బందికి ప్రత్యేక సెలవులపై నెలకొన్న వివాదం నెలకొనడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా దినోత్సవం రోజే నిమ్స్ పారా మెడికల్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి విజయకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. నర్సుల పట్ల నిమ్స్ డైరెక్టర్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు నిమ్స్‌కు చేరుకోవడంతో పోలీసులు, సిబ్బంది మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ స్పందిస్తూ మహిళా సిబ్బంది డిమాండ్లు, హామీలు నెరవేరుస్తామని చెప్పడంతో నర్సులు శాంతించారు.