తెలంగాణ

నెహ్రూ శాంతిదూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 8:మనదేశంతోసహా ప్రపంచం అంతటా కుల, మత, జాతి, ప్రాంతీయ కారణాల రీత్యా యుద్ధకాంక్ష పెరిగిపోయిందని, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఈ వైఖరి విపరీత పరిణామాలకు దారితీస్తోందని కేంద్ర మాజీ మంత్రి సూదిన జైపాల్‌రెడ్డి అన్నారు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో శాంతి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఒక్కరే దీనికి మినహాయింపని ఆయన అన్నారు. ఆయన హయాంలో శాంతి పరిఢవిల్లిందని, అయితే దేశ నాయకులు ఆయనను యుద్ధం చేయలేని బలహీనుడిగా విమర్శిస్తే ప్రపంచం ఆయనను శాంతిదూతగా అభివర్ణించిందని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం జరిగిన అఖిల భారత శాంతి సంఘీభావం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మా ట్లాడుతూ ప్రపంచంలోని పలు దేశా ల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, దాంతో ప్రజల్లో శాంతిలేకుండా పోయిందని అన్నారు. ప్రపంచంలోని చాలామంది నాయకులు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తూ ప్రజలపై బాంబులు కురిపిస్తున్నారని అన్నారు. యుద్ధాలతో మానవాళి, జీవరాశుల మనుగడకు తీవ్ర ప్రమాదం జరుగుతుందన్నారు. మొదటి ప్రపంచ యసద్దంలో కోటి మంది చనిపోయారని, రెండవ ప్రపంచ యుద్దంలో దాదాపు ఎనిమిది కోట్లమంది చనిపోయారని, అందులో రష్యాలోనే రెండు కోట్లమంది అప్పట్లో చనియపోయారని ఆయన గుర్తుచేశారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ట్రంప్ సైతం ఆహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితిని కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడని, ఆ సంస్థపట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. దేశంలో సిద్ధాంతాలను నేతలు పక్కనపడేశారని, ఆధిపత్యంకోసం ఏ మైనా చేసే స్థితికి చేరారని అన్నారు. శాంతిసామరస్యాలు పెరగాల్సిన తరుణం ఇదని ఆయన అన్నారు.