తెలంగాణ

ఇపిఎఫ్‌కు ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: దేశంలో ఇపిఎఫ్ ఖాతాదారులు ఆధార్‌తో అనుసంధానం కావలసిందేనని కేంద్ర కార్మిక మంత్రి బండారుదత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం సాయం త్రం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఖాతాదారులను, సంస్థలను కోరామన్నారు. 4.30 కోట్ల మంది ఇపిఎఫ్ ఖాతాదారులున్నారని, 50 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని వివరించారు. పెన్షనర్లలో రెండు లక్షల మంది ఇప్పటికే ఆధార్‌ను అనుసంధించారన్నారు. అలాగే ఖాతాదరులందరికీ విశిష్ట సంఖ్యలు ఇచ్చామని, వలస కార్మికులకు ఇబ్బంది లేకుండా విశిష్ట సంఖ్య దోహదం చేస్తుందని అన్నారు. జీతాలను కూడా ఆన్‌లైన్‌లోనే వేయమని ఆయా సంస్థలను ఆదేశించామని తద్వారా ఎవరికి ఎంతమేరకు కనీస వేతనం అందుతుందో స్పష్టమవుతుందన్నారు. దేశంలో 105కోట్ల ఆధార్ కార్డులు, 102కోట్ల స్మార్ట్ఫున్లు ఉన్నాయని అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఆ మేరకు లేవని చెప్పారు.
అందుకే 23 రకాల వెసులు బాటులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. జీడిమెట్ల షాపూర్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో సకల హంగులతో ఇఎస్‌ఐసి మోడల్ డిస్పెన్సరీ, డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

చిత్రం..సోమవారం షాపూర్‌నగర్‌లో ఇఎస్‌ఐ మోడల్ డిస్పెన్సరీ ప్రారంభించి మంచాలను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్టమ్రంత్రులు నాయని, మహేందర్‌రెడ్డి తదితరులు