తెలంగాణ

అక్టోబర్ నుంచి కాళేశ్వరం నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అక్టోబర్ కల్లా నీరు విడుదల చేసే లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టు సంస్థలను నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆసియాలోనే రికార్డు నెలకొల్పాలని మంత్రి అధికారులకు సూచించారు. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల డిజైన్లను వెంటనే సమర్పించాలని సెంట్రల్ డిజైనింగ్ విభాగాన్ని మంత్రి ఆదేశించారు. జలసౌధలో సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థలు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోదావరి జలాలలను అక్టోబర్ కల్లా సాగునీటికి విడుదల చేయాలన్నది సిఎం కెసిఆర్ ఆకాంక్ష అని గుర్తుచేశారు.
నీటిపారుదల, రెవిన్యూ, అటవీ, విద్యుత్, గనుల శాఖలు కాంట్రాక్టు పొందిన సంస్థలతో సమన్వయం చేసుకొని నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. భూ సేకరణను వేగవంతం చేయాలని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు పంప్ హౌజులు ఏకకాలంలో జరగాలని మంత్రి ఆదేశించారు. కనే్నపల్లి పంప్ హౌజ్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారులు వివరించారు. ఈ పంప్ హౌజ్ నిర్మాణానికి ప్రతిరోజు 35 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ జరుగుతుందని వారు వివరించారు. దీనిని 60 వేల క్యూబిక్ మీటర్లకు పెంచాలని, కాంక్రీట్ పనులు వచ్చేనెలాఖరుకల్లా ప్రారంభం కావాలని మంత్రి ఆదేశించారు. అన్నారం పంప్‌హౌజ్‌కు కాంక్రీట్ పనులను వచ్చే నెలలో ప్రారంభించాలన్నారు.
సుందిళ్ల పంప్‌హౌజ్ కోసం 354 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 110 ఎకరాలు సేకరించినట్టు అధికారులు వివరించారు. మిగతా భూసేకరణను త్వరగా పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ అలుగు వర్షిణిని మంత్రి కోరారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇ-ఎన్-సి మురళీధర్‌రావు, సెంట్రల్ డిజైనింగ్ చీఫ్ ఇంజనీర్ నరేందర్‌రెడ్డి, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు