తెలంగాణ

చరిత్రాత్మకంగా ఉస్మానియా శతాబ్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: అఖిల భారత వైస్ చాన్సలర్ల సదస్సు ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జరగనుంది. అలాగే మరుసటి రోజు ఏప్రిల్ 28న ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలకు ఉస్మానియా యూనివర్శిటీ వేదిక కానుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని, అందులో భాగంగానే జాతీయ వైస్ ఛాన్సలర్ల సదస్సు, ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఏప్రిల్ 26 నుండి మూడు రోజుల పాటు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి సోమవారం నాడు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎంపి కేశవరావు, సలహాదారు పాపారావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఉస్మానియా విసి ప్రొఫెసర్ రామచంద్రం, జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు ఉస్మానియాకు మధ్య అవినాభావ సంబంధం ఉందని కడియం పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు, ఎప్పటికీ గుర్తుండిపోయేందుకు ఏడాది పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదటి మూడు రోజులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్ళనలు, తెలంగాణ సాంస్కృతిక సారథి, తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు 30 కమిటీలను నియమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యుజిసి, ఎఐటియుసి తదితర సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. విసిల సదస్సుకు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతారని అన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని యూనివర్శిటీ ప్రారంభం నుండి నేటి వరకూ ప్రచురించిన వంద ఉత్తమ గ్రంథాలను మరోమారు ప్రచురిస్తామని అన్నారు. మరో వారం రోజుల్లో ఉత్సవాల లోగో, బ్రోచర్ ఆవిష్కరిస్తామని చెప్పారు. మార్చిలోగా న్యాక్ గుర్తింపు సాధిస్తామని, విద్యార్థుల మెస్ బిల్లులను కూడా చెల్లిస్తామని చెప్పారు.

చిత్రం..ఉస్మానియా వర్శిటీ శతాబ్ది ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తున్న డిప్యూటీ సిఎం కడియం