తెలంగాణ

50 రోజులు గడిచినా తీరని కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తనకు 50 రోజుల గడువు ఇస్తే నోట్ల కష్టాలు తీర్చడమే కాకుండా నల్లకుబేరులను పట్టేసుకుని విప్లవాత్మకమైన మార్పులు తెస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నీటి మూటలే అయ్యాయని ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు విమర్శించారు. 50 రోజులు కాదు కదా 60 రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడేమో భవిష్యత్తు తరాల కోసం నోట్ల రద్దు చేశామని అంటున్నారని ఆయన తెలిపారు. నల్లధనాన్ని పట్టుకునేందుకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడ్డుపడుతున్నారని మోదీ చేసిన విమర్శలో వాస్తవం లేదని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ఎందరు నల్లకుబేరులను పట్టుకున్నారో, ఏ మేరకు నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారో లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో ధనప్రవాహం చేసేందుకే 2 వేల రూపాయల నోట్లను దాచుకున్నారని ఆయన బిజెపి నేతలను విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పంపించే భూ సేకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించకుండా వెనక్కి పంపించాలని ఆయన ప్రధానిని కోరారు. అప్పుడే ప్రధానికి న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందని నమ్ముతామని అన్నారు. నోట్ల రద్దుపై తాను ఈ నెల 16 నుంచి మళ్లీ జిల్లా పర్యటనలు చేపడతానని ఆయన తెలిపారు.