తెలంగాణ

వలస నేత వసూళ్ల దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీకి మచ్చ తెచ్చేలా ఎవరూ వ్యవహరించరాదని ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశాలలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంటే, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఓ వలస నేత ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పత్రికా ప్రకటనలు, ప్రచార ఆర్భాటాల పేరుతో కొనసాగిన వసూళ్ల పర్వం అధికారులనే కాకుండా పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్యే జన్మదినం వేడుక ఆర్భాటాలకు అన్నీ తానై వ్యవహరించిన సదరు నేత వ్యవహారం బయటకు పొక్కి ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టికి వెళ్లడంతో పార్టీ శ్రేణుల ద్వారా గుట్టుగా వారు వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఐదు రోజులుగా వివిధ శాఖలకు చెందిన అధికారులకు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు వలస నేత తన సొంత మొబైల్ ద్వారా ఫోన్లు చేసి మరీ వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. పార్టీ పరంగా చందాలు, విరాళాలు వసూలు చేయడం సర్వసాధరణమే అయినప్పటికీ, ఎమ్మెల్యే జన్మదినం పేరుతో పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుని, వాటిని పక్కదారి పట్టించడంతో ఈ వసూళ్ల బాగోతం కాస్తా రచ్చకెక్కింది. ఎమ్మెల్యే స్థానికంగా లేకున్నప్పటికీ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని భరోసా కల్పించి సర్వం తానై పెద్ద ఎత్తున వసూళ్లు చేయడాన్ని చూసి సొంత పార్టీకి చెందిన నాయకులు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఈ వాస్తవం శాసనసభ్యుడి దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు కానీ సదరు వలస నేత అనుసరించిన తీరు పార్టీకి అప్రతిష్టను మూటగట్టిందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మదిన వేడుకల కోసం పార్టీ కార్యకర్తలు రక్తదానం, అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేయగా ఈ ఒక్క నాయకుడు మాత్రం వసూళ్లే ధ్యేయంగా పెట్టుకోవడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. పలు ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులకు సైతం ఫోన్లు చేసి తమవంతు సహకారాన్ని అందించాలని డిమాండ్ చేయడంతో ఈ విషయం కాస్తా ఉన్నత స్థాయి నాయకులకు చేరింది. అలాగే పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ముఖ్యమైన అధికారులకు కూడా సదరు నాయకుడు ఫోన్ చేసి సహకరించాలని కోరగా వారు సైతం ఆశ్చర్యపోయి ఇటువంటి వాటికి తాము దూరమని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈ వలస నేత వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారడంతో సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి బోధన్ నియోజకవర్గంలోని కొంతమంది కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి వలస నేత చేసిన ఫోన్ కాల్స్ గురించి, ఆయన అడిగిన చందాల వివరాల గురించి ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మైనార్టీ వర్గం నుండి ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికైన బోధన్ శాసనసభ్యుడు మొదటి నుండీ అనేక విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తుంటే ఆయన అమాయకత్వాన్ని వలస నేత ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేను దెబ్బతీసేందుకు ఇటువంటి వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగా ఆరోపిస్తున్నాయి.