తెలంగాణ

విద్యావ్యతిరేక విధానాలపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 3వ తేదీన ఛలో పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, కార్యదర్శి కోట రమేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం నాడు వారు పాత్రికేయులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, కెజి టు పిజి విద్యావిధానం అమలుచేయాలని, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. హాస్టల్ విద్యార్ధుల మెస్ , కాస్మొటిక్ చార్జీలు వెంటనే పెంచాలని, విద్యార్ధినులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరోధించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని, ఎయిడెడ్ విద్యాసంస్థల అభివృద్ధికి అధిక నిధులు విడుదల చేయాలని, యూనివర్శిటీలకు అభివృద్ధి నిధులను విడుదల చేయాలని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేధించాలని, నాణ్యమైన వృత్తి విద్యను అందించాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని వారు పేర్కొన్నారు. 93 మందితో రాష్ట్ర కమిటీని, 24 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నట్టు వారు చెప్పారు.