తెలంగాణ

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, జనవరి 9: అరబిక్ భాష నేర్చుకునేందుకు వెడుతున్న ఆరేళ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి పరారవగా 40 నిమిషాల్లో అతడిని పట్టుకున్న పోలీసులు ఆ చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. కోరుట్ల పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. జగిత్యాల ఎస్పీ అనంతశర్మ ఈ కేసు వివరాలు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 5:40 గంటల ప్రాంతంలో మోమిన్‌పురకు చెందిన చెకిష్ట ఫాతిమ ఆనే 6 సంవత్సరాల పాప ఇంటి నుండి అరబిక్ చదువుకోవడానికి తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. కోరుట్లకు చెందిన ఆటో డ్రైవర్ మున్న అలియాస్ నరుూముద్దీన్ అనే వ్యక్తి ఆ చిన్నారిని ఆపి ఆటోలో ఎక్కించుకొని పారిపోయాడు. ఆ దృశ్యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి సిసి కెమెరా పుటేజ్ ఆధారంగా నింనితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 40 నిమిషాల్లోగా అతడి ఆచూకీ కనుగొని అరెస్టు చేసి చిన్నారిని తల్లిదండ్రలకు అప్పగించారు. కాగా ఆటోడ్రైవర్ మున్నా 18 ఏళ్ళ నేరచరిత్ర ఉన్నదని, గతంలో కరీంనగర్, వరంగల్ జిల్లాలలో జరిగిన పలు దొంగతనాలు, కిడ్నాప్ కేసులలో నిందితుడని ఎస్‌పి తెలిపారు.

చిత్రం..కిడ్నాపర్ చెర నుంచి బయట పడిన చిన్నారి