తెలంగాణ

ఆదర్శ పాఠశాలలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జనవరి 9:ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినులలో 60మంది అస్వస్థతకు గురికాగా వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎంపి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లిలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారని, తప్పనిపరిస్థితిలో బయటకు చెప్పారని పాఠశాల సిబ్బందిపై బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగహం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థినులు తమతమ గదుల్లోకి వెళ్లారు. అక్కడ వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపడిపోయారు. విషయం తెలుసుకున్న సిబ్బంది ఎఎన్‌ఎమ్‌లను రప్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మొత్తం 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారిలో ఎం.సరిత, ఏ.జ్యోత్స్న, బి.ప్రవళిక, ఎస్. నవ్య, ఎం.మేఘన, బి.స్రవంతి, ఎన్.దేవిప్రణీత, సిహెచ్. సంధ్యల పరిస్థితి విషమంగా మారింది. ప్రాథమిక చికిత్స అనంతరం 40మందిని సాయంత్రం ఇళ్లకు పంపించారు. మిగతావారికి చికిత్స కొనసాగిస్తున్నారు. అప్పటికి కానీ అసలు విషయం తెలియని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకుగురయ్యారు. తమకు చెప్పకుండా దాచిపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారని, వారికేమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎం ఈవో రాజయ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చిత్రం..అస్వస్థతకు గురైన విద్యార్థినులు