తెలంగాణ

తక్షణం విధుల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేస్తే వారి సర్వీసులు క్రమబద్ధీకరించడం కష్టమవుతుందని, తక్షణం విధుల్లోకి చేరాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. లేకుంటే జీవో 16 ప్రకారం అనర్హులుగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత మూడు నెలలుగా కాంట్రాక్టు లెక్చరర్లు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణపై సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యుటీ సిఎం, కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గ సమావేశంలోనే తీర్మానం చేయడం జరిగిందని, వేతనాలను 50 శాతం పెంచాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేయడం సహేతుకం కాదన్నారు. దేశంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను ఉచిత విద్య చేసిందని, పేద విద్యార్ధులకు విద్య భారం కాకుండా చేసేందుకు ఉచితంగా పుస్తకాలు కూడా ఇస్తోందన్నారు. 404 జూనియర్ కాలేజీల్లో 1,73,296 మంది విద్యార్ధులు చదువుతున్నారని, ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్య, ఉచిత పుస్తకాల వల్ల వీరందరికీ లబ్ది చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వాలు 2004 నుండి 2014 వరకూ 79 జూనియర్ కాలేజీలు మంజూరు చేసినా, ఒక్క కాలేజీలోనూ ఫర్నీచర్ లేదా కనీస వసతులు కల్పించలేదని పేర్కొన్నారు. పేపర్ మీదనే కాలేజీలను మంజూరు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఇపుడు 79 జూనియర్ కాలేజీల్లో 69 కాలేజీలకు భూమినిచ్చి, భవనాలు కట్టడానికి నిధులు కూడా మంజూరు చేసిందని గుర్తు చేశారు. కనీస వసతుల కోసం 42 కోట్లు ఖర్చు చేసిందని, వౌలిక సదుపాయాలకు జూనియర్ కాలేజీలకు ఇప్పటికే 253 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు మీద 3687 మంది జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారని వీరందరి సర్వీసులు క్రమబద్ధీకరణకు 2016 ఫిబ్రవరి 7న క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. 2016 ఫిబ్రవరి 26న జీవో 16ను జారీ చేశామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించామని, అర్హతలు, నిబంధనలు నిర్ణయించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ఈక్రమంలో ఉస్మానియాకు చెందిన కొంతమంది కోర్టుకు వెళ్లడంతో తుది తీర్పు ఇచ్చే వరకూ క్రమబద్ధీకరణ చేయవద్దని ఆదేశాలు వచ్చాయని వివరించారు. ఆర్ధిక శాఖ ఇచ్చిన జీవో 14 ప్రకారం 50 శాతం వేతనాలు ప్రస్తుతానికి పెంచుతున్నామని చెప్పారు. ఇంటర్ విద్యలో అవినీతి లేకుండా 22 సర్వీసులను ఆన్ లైన్ చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలోని జూనియర్ కాలేజీల్లో కేవలం 1.73 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని మిగిలిన వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారని పేర్కొన్నారు. ఇంటర్ విద్యను ఆదర్శవంతంగా చేసేందుకు కాలేజీల్లో కనీస వసతులు. కల్పిస్తున్నామని, వౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని, సిబ్బందిని కూడా క్రమబద్ధీకరణ చేయాలని, వేతనాలు పెంచాలని కూడా నిర్ణయించామని వివరించారు. ఇలాంటి సందర్భంలో రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కొంత మంది సమ్మె చేస్తున్నారని కనీసం 34 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం వారి కాంట్రాక్టు రద్దు చేసేందుకు వీలుందని, ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న సమయంలో ఇలాంటి వ్యవహారాలు మంచిది కాదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి జీవో 16 ప్రకారం సమ్మె చేయడం అనధికారికంగా విధులకు హాజరుకాకపోవడమేనని వివరించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల వేతనాలకు సంబంధించిన జీవో కూడా జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాత్రికేయులకు చెప్పారు.