తెలంగాణ

వేగంగా వార్దా-డిచ్‌పల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చినాటికి లైన్ పనులు పూర్తికావాలి కొత్త గ్రిడ్‌లను దక్షిణాదికి అనుసంధానించండి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను కోరిన కెసిఆర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లో పెట్టుబడులకు రెడీ
సంసిద్ధత వ్యక్తం చేసిన పిజిసిఐఎల్ సిఎంతో పిజిసిఐఎల్ చైర్మన్ భేటీ

హైదరాబాద్, జనవరి 10: నార్త్, ఈస్ట్, వెస్ట్ న్యూ గ్రిడ్‌లనుంచి దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ గ్రిడ్‌లను అనుసంధానించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పిజిసిఐఎల్) చైర్మన్ ఐఎస్ ఝాను సిఎం కె చంద్రశేఖర్ రావు కోరారు. న్యూగ్రిడ్‌ల నుంచి సదరన్ గ్రిడ్‌కు విద్యుత్ లైన్ల నిర్మాణం పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి, డిమాండ్‌లకు మధ్య సమన్వయం సాధించవచ్చని సిఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన పిజిసిఐఎల్ చైర్మన్ ఝా, సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావుతో కలిసి మంగళవారం ప్రగతి భవన్‌లో సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం మేరకు విద్యుత్ తెచ్చుకోవడానికి వార్దా (మహారాష్ట్ర)- డిచ్‌పల్లి (తెలంగాణ) మధ్య విద్యుత్ లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ ఏడాది మార్చినాటికి వార్థా- డిచ్‌పల్లి లైన్ పూర్తి చేస్తామని పిజిసిఐఎల్ అధికారులు వివరించారు. ఈ రెండింటి మధ్య 4500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 765 కెవి డబుల్ సర్క్యూట్ లైన్ త్వరగా పూర్తి చేస్తే చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెచ్చుకోవడాన్ని ప్రారంభిస్తామని సిఎం కోరారు. అలాగే వరంగల్- వరోరా (మహారాష్ట్ర) విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తయితే న్యూగ్రిడ్- సదరన్ గ్రిడ్ మధ్య విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. ఇది పూర్తయితే దేశమంతా విద్యుత్ సరఫరా అనుసంధానం అవుతుందన్నారు. ఇలావుండగా తెలంగాణ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి పిజిసిఐఎల్ సంసిద్ధత వ్యక్తం చేయగా, వారితో రాష్ట్ర అధికారులు త్వరలో సమావేశమై చర్చలు జరపాల్సిందిగా సిఎం ఆదేశించారు. పిజిసిఐఎల్ అధికారులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఒ అధికారులు ఎస్ నర్సింగ్‌రావు, శాంతకుమారి, రామకృష్ణారావు, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... రాష్ట్రానికి వచ్చిన పిజిసిఐఎల్ చైర్మన్ ఐఎస్ ఝాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సిఎం కెసిఆర్