తెలంగాణ

విద్యుత్ చార్జీల బాదుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు నెత్తిన కరెంటు చార్జీల పిడుగుపడనుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు రూ.1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సదరన్ డిస్కాం, నార్తరన్ డిస్కాంలు మంగళవారం ఇక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై తెలంగాణ డిస్కాం బహిరంగ విచారణ నిర్వహించి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించి తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. తెలంగాణ డిస్కాంలు ప్రతిపాదనల ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారుల్లో మొదటి వంద యూనిట్ల వరకు ప్రతి నెల విద్యుత్ వాడే వారిని కనికరించే వదిలేశారు. ఆ తర్వాత 101-400 యూనిట్ల వరకు విద్యుత్ వాడితే యూనిట్ చార్జీని రూ.65 పైసల నుంచి రూ.72 పైసలకు పెంచాలని ప్రతిపాదించారు. 400 యూనిట్లు దాటితే మాత్రం యూనిట్ చార్జీని ఎకాఎకిన ఒక రూపాయి పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో మొత్తం 119.6 లక్షల వినియోగదారులు ఉన్నారు. ఇందులో 80.9 లక్షల మందికి టారిఫ్ ప్రభావం ఉండదు. మొత్తం 86 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారుల్లో 60.1 లక్షల మందిపై విద్యుత్ చార్జీల ప్రభావం ఉండబోదని డిస్కాంలు తెలిపాయి. దాదాపు 16 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులపై మాత్రమే చార్జీల పెంపు ప్రభావం ఉంటుంది. ఎప్పటి లాగానే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తారు. 20.7 లక్షల మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, 8681 కాటేజి ఇండస్ట్రీ విద్యుత్ వినియోగదారులకు చార్జీలను పెంచలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని డిస్కాంలు పేర్కొన్నాయి.
ఎల్‌టి కేటగిరీలో పారిశ్రామిక సంస్ధలపై ఆరు శాతం, కమర్షియల్ స్ట్రీట్ లైట్స్‌పై 10 శాతం విద్యుత్ చార్జీలను పెంచనున్నారు. నెలకురెండు వందల యూనిట్ల వరకు వాడే హెయిల్ సెలూన్లను ఎల్‌టి-2 డి కేటగిరీ కిందకు తెచ్చారు. ఫెర్రో అల్లాయిస్‌కు టారిఫ్‌ను పెంచలేదు. హెచ్‌టి 1(ఏ) ఇండస్ట్రియల్ వినియోగదారులు 7.5 శాతం, హెచ్‌టి-2 కమర్షియల్ వినియోగదారులకు, హెచ్‌టి 3 ఎయిర్‌పోర్టులకు, హెచ్‌టి-4, హెచ్‌టి ఆరు టౌన్‌షిప్‌లు, హెచ్‌టి ట్రాక్షన్‌లకు విద్యుత్ చార్జీలను పదిశాతం పెంచాలని ప్రతిపాదించారు. వార్షిక రెవెన్యూ 30,207 కోట్ల అవసరమని అంచనా వేశారు. ఇందులో 21,418 కోట్ల రెవెన్యూ వస్తుందని, విద్యుత్ లోటు 8789 కోట్ల రూపాయలను పూడ్చుకునేందుకు విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని డిస్కాంలు టిఎస్‌ఇఆర్‌సిని కోరాయి. ఒక యూనిట్ విద్యుత్ చార్జీ సరఫరాకు రూ.6.44 పైసలు ఖర్చవుతోందని, కాని రూ.4.56 పైసలు వస్తోందని, లోటు రూ.1.88పైసలు ఉందని డిస్కాంలు తెలిపాయి. 2016-17 సంవత్సరానికి దీర్ఘకాలం, మధ్య కాలిక ఒప్పందాల ద్వారా 57,222 ఎంయు విద్యుత్ లభ్యత ఉందని, సాలీనా 54,884 ఎంయు విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోతుందని, మిగులు విద్యుత్ లభిస్తుందని డిస్కాంలు అంచనా వేశాయి. కేంద్రం ప్రకటించిన ఉజ్వల్ డిస్కాం అష్యూరెన్స్ స్కీంలో చేరినట్లు దీని వల్ల డిస్కాంలు ఆర్థికంగా కోలుకుంటాయని డిస్కాంలు తెలిపాయి. తెలంగాణలో కెటిపిపి స్టేజి 2 నుంచి 600 మెగావాట్లు, సింగరేణి స్టేజి 1 నుంచి యూనిట్ 1లో 600 మెగావాట్లు, యూనిట్ 2 నుంచి 600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందని డిస్కాంలు పేర్కొన్నాయి.