తెలంగాణ

ప్రతి జిల్లాలో ఐదు చేపల మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ప్రతి జిల్లాలో ఐదేసి చేపల మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మార్కెట్లను ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. సచివాలయంలో మంగళవారం మత్స్య, పాడి పరిశ్రమ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, గతంలో మునుపెన్నడూ లేనివిధంగా మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకం దారుల ప్రయోజనం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా కులాలకు సంబంధించిన తమ సొసైటీలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకురేలా పాడి, మత్స్య, పశుసంవర్ధకశాఖలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లు, కుంటలతో పాటు మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులలో చేపలు పెంచడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి తెలిపారు. మత్స్యశాఖలో ఖాళీల భర్తీతో పాటు అదనంగా పోస్టులు భర్తీ చేసి రాష్ట్రం నుంచి చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో మోడల్ చేపల మార్కెట్ల ఏర్పాటుకు సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మత్స్య శాఖకు గతంలో రూ. 5 కోట్లు కేటాయించగా కోటి కూడా ఖర్చు పెట్టేవారు కాదని, తమ ప్రభుత్వం ఏకంగా రూ.101 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని గుర్తు చేశారు. చేపలు, గొర్రెల పెంపకందారులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పశుసంవర్ధకశాఖ ద్వారా 100 సంచార వెటనరీ వైద్యశాలలను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించనున్నట్టు మంత్రి చెప్పారు. విజయ డైయిరీ అవుట్ లెట్లను పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, జాతీయ రహదారులపై ఏర్పాటు చేస్తామన్నారు. గోపాలమిత్ర సర్వీసులను విస్తృతంగా వినియోగించుకుంటామని మంత్రి చెప్పారు.

సచివాలయంలో మంగళవారం మత్స్య, పాడి పరిశ్రమ
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్