తెలంగాణ

రవ్వా శ్రీహరికి జీవన సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: ప్రఖ్యాత సాహితీవేత్త, మాజీ ఉప కులపతి రవ్వా శ్రీహరికి తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు మొత్తం 9 మందికి వివిధ రంగాలకు సంబంధించి పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణ రచయితలకు, కళాకారులకు, పౌరసమాజ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తేనా) 2017 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ పునరుజ్జీవన గౌరవ పురస్కారాలను ప్రకటించింది. సాహిత్యం, కళాసంస్కృతులు, సామాజిక పరిశోధన, సామాజిక మార్పు, పత్రికారంగం, లఘుచిత్ర నిర్మాణం, కొత్త రచనా ప్రచురణ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభావంతులకు జ్ఞాపికను, 50వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందిస్తోంది. తెలంగాణ వైతాళికుల పేరిట నెలకొల్పిన ఈ పురస్కారాలను ఈ నెల 12న రవీంద్రభారతిలో ప్రదానం చేస్తామని సంస్థ చైర్మన్ నారాయణ స్వామి వెంకటయోగి, అధ్యక్షుడు వెంకట్ మారోజు తెలిపారు. సాహిత్యంలో కాళోజీ నారాయణ రావు పురస్కారాన్ని అంపశయ్య నవీన్‌కు, కళాసంస్కృతులు రంగంలో చిందు ఎల్లమ్మ పురస్కారాన్ని జయరాజ్‌కు, సామాజిక పరిశోధన, ఆవిష్కరణ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ పురస్కారాన్ని హెచ్ రమేష్‌బాబుకు, సామాజిక మార్పు రంగంలో కొమరం భీం పురస్కారం కనక సుగుణకు, పత్రికారంగంలో షోయిబుల్లా ఖాన్ పురస్కారాన్ని పాశం యాదగిరికి, లఘుచిత్ర నిర్మాణంలో పైడి జయరాజ్ పురస్కారం శ్రవణ్ కటికనేనికి, ప్రచురణల గ్రాంటు రంగంలో సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని తాయమ్మ కరుణకు, డిప్లొమో ఆఫ్ మెరిట్ కింద వి-6 తీన్మార్ బృందానికి ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది.

అయ్యప్ప భక్తుల కోసం భవనం
నీలక్కళ్‌లో స్థలం ఇస్తాం
హామీ ఇచ్చిన కేరళ ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ నుండి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల విడిది కోసం నిర్మించతలపెట్టిన భవనానికి అవసరమైన స్థలాన్ని నీలక్కళ్‌లో ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది. రెండు, మూడు నెలల్లో స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తామని కేరళ ప్రభుత్వం ప్రతినిధి హామీ ఇచ్చారు. తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వైద్యఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం శబరిమలలో అయ్యప్పస్వామిని సందర్శించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చిందని అధికార వర్గాలు ప్రకటించాయి.