రాష్ట్రీయం

ఆందోళన కలిగిస్తున్న వాతావరణంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: వాతావరణ మార్పులతో నీరు, గాలి కాలుష్యంపై ప్రభావం చూపిస్తున్నందున దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్‌ఐ) తెలిపింది. వాతావరణ మార్పులపై మంగళవారం ఇపిటిఆర్‌ఐ నోడల్ ఏజెన్సీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి, మురుగు నీటిపారుదల బోర్డు సంయుక్తంగా అమెరికాలోని చికాగోకు చెందిన మెట్రోపాలిటన్ వాటర్ రిక్లమేషన్ డిస్ట్రిక్ ఆఫ్ గ్రేటర్ చికాగో (ఎండబ్ల్యుఆర్‌డి) సహాకారంతో రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ బి. కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి నవీన్ మిట్టల్, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దాన కిషోర్, అమెరికాకు చెందిన ఎండబ్ల్యుఆర్‌డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిట్ సెంట్ పియర్రే, ఎండబ్ల్యుఆర్‌డి ఆర్థిక విభాగం చైర్మన్ ఫ్రాంక్ అవిలా, ఇపిటిఆర్‌ఐ పర్యావరణ ఇంజనీర్ షేక్ అల్లవలీ తదితరులు పాల్గొన్నారు. చికాగోకు చెందిన ఎండబ్ల్యుఆర్‌డి అక్కడ డ్రైనేజీ, మురుగు నీటి పారుదల ట్రీట్‌మెంట్ ప్లాంట్లను, వర్షపు నీటి డ్రైనేజీల నిర్వహణను విజయవంతంగా నిర్వహిస్తున్నది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఎండబ్ల్యుఆర్‌డి ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో వివరించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా, నిరుపయోగ వ్యర్థాల వినియోగ సౌకర్యం మెరుగుపరచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని రాష్ట్రానికి చెందిన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎండబ్ల్యుఆర్‌డి ప్రతినిధులు తమ అనుభవాలను వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలు, నీరు, సంక్షేమం, పరిశ్రమలు, విద్యుత్తు వంటి ముఖ్యమైన విభాగాలపై వాతావరణ మార్పులతో పడుతున్న ప్రభావం గురించి రాష్ట్రానికి చెందిన అధికారులు తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన నోడల్ ఏజెన్సీ ఇపిటిఆర్‌ఐ అధికారులు చెప్పారు.