ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌లో పిడక బ రూ. 129!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: కవితకు కాదేదీ అనర్హం అన్నాడో కవి.. నేటి ఇంటర్నెట్ యుగంలో దీనిని కొద్దిగా మార్చుకుంటే.. నెట్టింట్లో అమ్మకానికి కాదేదీ అనర్హం అనవచ్చు. వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డరు ఇచ్చి, కొనుగోలు చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే ఒక వ్యాపార సంస్థ పిడకలను కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. అమెజాన్ సంస్థలో అమిత్ మార్కెటింగ్ అనే సంస్థ ఆవు పేడతో చేసిన పిడకలను కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. హిందువులు వివిధ పండుగలు, యజ్ఞయాగాదుల్లో పిడకలను ఉపయోగించడం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో పిడకను 129 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మరో 15 సంస్థలు కూడా ఒక్కో పిడక 120 రూపాయలకు విక్రయిస్తున్నాయి. మరో సంస్థ 8 పిడకలను 40 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. భోగి పండుగ సందర్భంగా పిడకలు లేవని బాధ పడకుండా ఆన్‌లైన్‌లో ఎంచక్కా కొనుగోలు చేయొచ్చు!