ఆంధ్రప్రదేశ్‌

ప్రజా వికాసమే కేంద్రం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 10: ప్రజా వికాసమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఐదేళ్ల మేకిన్ ఇండియా అగ్రగామిగా నిలుస్తుందని కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజులుగా జరుగుతున్న 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 2.5 లక్షల పంచాయతీల్లో ఐటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని, దీనికోసం 8వేల కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమ పథకాలను, రాయితీలను లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా చెల్లించేందుకు ఐటి ఉపకరిస్తుందన్నారు. దీనికోసం హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆధార్ అనుసంధానంతో బినామీల బెడద ఉండదన్నారు. ఇప్పటికే దేశంలో 125 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది ఆధార్ కార్డులు తీసుకున్నారని, బ్యాంకు ఖాతాలు పూర్తిగా ఆధార్‌తో అనుసంధానమైనట్టు తెలిపారు. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోనున్నట్టు చౌదరి తెలిపారు. ప్రభుత్వం రంగం, పారిశ్రామిక, పరిపాలన రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా పారదర్శకత పెగుతుందని, సిబ్బంది, అధికారుల్లో జవాబుదారీ తనం మెరుగవుతుందన్నారు. 2030 నాటికి దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం రంగాల్లో డిజిటల్ 3డి యానిమేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కేంద్రాల్లో 3డి యానిమేషన్ విధానంలో విద్యా బోధన మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. నల్లధనం నిర్మూలనలో నోట్ల రద్దు మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. చలామణిలోలేని 86 శాతం పెద్ద నోట్లు, రద్దు నిర్ణయంతో బ్యాంకులకు వచ్చి చేరాయన్నారు. పన్ను వసూళ్లు కూడా బాగా పెరిగాయన్నారు. నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన మెచ్చుకున్నారు. అలాగే 725 ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రక్రియ అభినందనీయమన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ ఐటి సేవల అమల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.