ఆంధ్రప్రదేశ్‌

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 10: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1,77,106 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి ఇ ఓ సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏకాదశి రోజున 92,624 మంది, ద్వాదశి రోజున 84,480 మంది స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఇది రికార్డు అని ఆయన అన్నారు. దాతలు ఇచ్చిన రూ.36 లక్షల విరాళంతో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు. 1.50లక్షలు విడిపుష్పాలు, 500 కిలోల వివిధ రకాల ఫలాలను అలంకరణకు వినియోగించామన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విధులు నిర్వహించిన క్రిందిస్థాయి సిబ్బంది నుంచి అధికారులు వరకు ప్రతి ఒక్కరు అభినందనీయులని అన్నారు. ప్రముఖ పర్వదినాల్లో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఇ ఒ పిలుపునిచ్చారు.