ఆంధ్రప్రదేశ్‌

నా తపనంతా పేదల కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/గూడూరు, జనవరి 10: ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలన్నదే తన తపన అని, ఆ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉండి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామ జన్మభూమి- మావూరు గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనేక కారణాల వలన తల్లితండ్రులను పోషించలేక వారిని నిరాదరణకు గురిచేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఎటువంటి సంపాదన లేని వారి కోసం తాను సిఎం అయిన తరువాత రాష్ట్రం 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంకల్పంతో గతంలో ఇస్తున్న పింఛన్లను ఐదు రెట్లు పెంచి ఇస్తున్నందున ఇప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూడగలగుతున్నానని అన్నారు. రైతులకు సంబంధించి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను దఫాల వారీగా రద్దు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందన్నారు. చెన్నూరు గ్రామంలో సంక్రాంతి పండుగ వాతావరణం జన్మభూమితో రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది పుట్టిన చెన్నూరు గడ్డ అని, వారు నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నారని, వారు జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు మన పండుగలని, ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఇది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి ఆనందంగా జరుపుకొనే పండుగ అని అన్నారు. ఆ పండుగ వాతావరణం నేడు ఈ గ్రామంలో తనకు కనిపించిందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకొంటున్నదని, ఇందుకోసం ప్రవేశ పెట్టిన పధకాలను గురించి ఆయన వివరించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి 15 సూత్రాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం యత్నిస్తున్నదని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 50 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మన రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు పోవాలంటే ఆరోగ్యం, విద్య పరంగా ముందుండాలన్నారు. తెలుగును కాపాడుకోకపోతే మనుగడ ఉండదని, ఉపాధి కోసమే ఇంగ్లీష్ నేర్చుకోవాలని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయి రాజధాని లేక, పరిశ్రమలు లేక, ఉపాధి అవకాశాలు, ఆదాయాలులేక పోయినా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో గత రెండున్నరేళ్లుగా ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నానని సిఎం అన్నారు. తన రాజధాని నిర్మాణానికి సంబంధించి అమరావతీలో రైతులు ల్యాండ్‌పూలింగ్‌కు పిలుపునిస్తే 30 వేల ఎకరాలకు పైగా రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి అందించారని, ఇందుకు 45 వేల కోట్లరూపాయలను ఖర్చు అయ్యాయని అన్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని, ఇందులో రాజకీయ ప్రయోజనాలతో అర్హులకు అన్యాయం జరిగితే సహించేది లేదని సిఎం సభలో అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు జరిగితే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదుచేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. జన్మభూమి కమిటీలు కూడా నిస్వార్ధంగా పనిచేయాలని, పార్టీ పరంగా వారిని అన్ని విధాలా తాను ఆదుకొంటానని చెప్పారు.

ఆరోగ్యంతోనే ఆనందం!
నెల్లూరు: సమయానికి సరైన సమతుల ఆహారాన్ని మితంగా తీసుకోవడం, నిత్యం ప్రశాంతమయ వాతావరణంలో పని చేసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని, ప్రతి ఒక్కరూ ఈ తరహా జీవనానికి అలవాటు పడితే ప్రశాంత జీవితాన్ని పొందిన వారవుతారని సిఎం బాబు అన్నారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేదాంత ధోరణిలో ఆహార, ఆరోగ్య విషయాలపై సభకు హాజరైన ప్రజలకు పలు సూచనలు, సలహాలు తెలియచేస్తూ తాను నిత్యం తీసుకునే ఆహారపు అలవాట్ల గురించి ఉదహరించారు. ఉదయం రాగి, సజ్జ, జొన్నల వంటి తృణ ధాన్యాలను జావగా తీసుకుంటానన్నారు. అంతకు ముందు ఉదయానే్న కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తాగుతానని తెలిపారు. మధ్యాహ్నం భోజనం కింద రెండు కోడిగుడ్డు తెల్లసొనలను, కొద్ది మోతాదులో రాగి, జొన్నల జావను తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం వేళ స్నాక్స్, టీ తీసుకుంటున్నానని, రాత్రికి పండ్ల ముక్కలు, సూప్ తీసుకుంటానని, రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగుతానని పేర్కొన్నారు. అన్ని రోగాలకు కారణం నాలుకేనన్నారు. నాలుకను అదుపులో పెట్టుకుని మితంగా ఆహారాన్ని తీసుకునే వారెందరు సభలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించగా ఒక్కసారిగా అక్కడ వౌనం నెలకొంది.