తెలంగాణ

అన్నింటా మహిళకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలోనే అన్ని రాష్ట్రాలను మించి మహిళలకు పెద్దపీట వేసి గౌరవించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహిళలకు అన్ని రంగాలలోను 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంటింటికి నల్లా పథకాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వంలో పూర్తి రక్షణ కల్పిస్తోందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన శాసనసభ ఉపసభాపతి పద్మ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ఇంకా ఎదగాలని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని నీటి సౌకర్యాన్ని మిషన్ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ సాధించారని పేర్కొన్నారు. మహిళాభివృద్ధి స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుమాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళాభ్యుదయంలో సాధించిన ఘనతకు నిదర్శనం ఈ ఉత్సవం అని అన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలను ప్రదానం చేశారు. దేశాపతి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరావు, కె.వి.రమణాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణకోసం కన్నకొడుకును అడవిలో వదిలి పోరాడిన 90 సంవత్సరాల వృద్ధురాలు చెన్నబోయిన కమలమ్మను ఘనంగా సత్కరించారు.