తెలంగాణ

వ్యవసాయానికి ఇక్రిశాట్ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, జనవరి 11: ఇక్రిశాట్, ఉట్నూరు ఐటిడిఎ అధికారుల స్ఫూర్తితో రాష్టవ్య్రాప్తంగా రైతులు పండించే పంటలకు ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. బుదవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో ఇక్రిశాట్, ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాల్‌మిల్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు సరైన ప్రాసెసింగ్ లేక వారు మద్దుతు ధరను పొందడంలేదని, దీనిని అధిగమించడానికి ఇక్రిశాట్ సంస్థ సహకారం తీసుకొని త్వరలో రాష్టవ్య్రాప్తంగా ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉట్నూరు ఐటిడిఎ ఆధ్వర్యంలో దాదాపు 12 లక్షల రూపాయలు వెచ్చించి రెండు దాల్ మిల్లులను ఏర్పాటు చేయగా, జొన్నల ప్రాసెసింగ్ మిల్‌ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ గ్రూపులు
రైతులు పండించే పంటలను కొనుగోలు చేయడానికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ సంఘాలను రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేస్తామని, ఈ సంఘాల ద్వారా మాత్రమే కొనుగోళ్లు, మార్కెటింగ్ జరిగేలా చూస్తామని హరీశ్ రావు అన్నారు. ఆయా కేంద్రాల్లోనే పంటల ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేస్తామని చెప్పారు. ఇదంతా ఉట్నూర్ ఐటిడిఎ, ఇక్రిశాట్ ద్వారా మాత్రమే జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఐకేపి ద్వారా కందులను కొనుగోలు చేస్తూవాటిని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసిన తర్వాత వచ్చిన లాభాలను సైతం రైతులకు అందచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇది రైతులకు లాభం కలిగించే పద్ధతని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర రైతులకు మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మంచిర్యాల కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, ఇక్రిశాట్ అధికారులను ఆయన అభినందించారు.

నలుగురు మైనర్ బాలికలపై
అత్యాచారయత్నం?
నిందితుడు పరారీ
నల్లగొండ రూరల్, జనవరి 11: నల్లగొండ మండల పరిధిలోని మర్రిగూడెం సమీపంలోని సుందరయ్య కాలనీలో మైనర్ బాలికలపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ రూరల్ ఎస్‌ఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం సుందరయ్య కాలనీలో నివాసముంటున్న పదేళ్లలోపున్న నలుగురు బాలికలపై స్థానిక యువకుడు నాగభూషణ్ (20) మూడు రోజుల నుండి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడి పరారీలో ఉన్నట్లు వివరించారు.