తెలంగాణ

తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతికి సంబంధించిన నివేదికను జాతీయ మానవ హక్కుల సంఘానికి పంపే విషయమై తుది నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో తాము ఎటువంటి సూచనలు చేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని, ఈ విషయమై కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. దీంతో ఎన్‌హెచ్‌ఆర్‌సికి నివేదికను పంపే విషయంతో తమకు సంబంధంలేదని, రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంటూ, ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

అసెంబ్లీ సమావేశాలకు
భద్రత మరింత కట్టుదిట్టం

పోలీసు ఉన్నతాధికారులకు స్పీకర్ ఆదేశం

హైదరాబాద్, మార్చి 8: శాసనసభ, శాసన మండలి సమావేశాల సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 10న తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో పోలీసు ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. శాసన మండలి చైర్మన్ ఎ.స్వామిగౌడ్ కూడా హాజరయ్యారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఐజి రాజీవ్ త్రివేది, శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతుండటం, తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభంకాబోతున్నందున పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని స్పీకర్ సూచించారు.