తెలంగాణ

మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బయటపెట్టాలని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన టిడిపి నేతలు సీతక్క, బోడ జనార్ధన్‌తో కలిసి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆకాశం నుంచి గోదావరి నదిని తానే భూమిపైకి తీసుకొచ్చిన అపర భగీరథుడిగా కెసిఆర్ ప్రచారం చేసుకుంటున్నారని, అలాగే ప్రాణహిత-చేవెళ్ల అంచనా వ్యయాన్ని రూ.35 వేలకోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ వారిని మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న కెసిఆర్ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును 152 నుంచి మీటర్లు కాకుండా 148 మీటర్లకే పరిమితం చేయాలని చాలా కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీ సహా 11 అక్రమ ప్రాజెక్టులను నిర్మించడంతో ఎస్సారెస్పీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఎడారిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్లీ ప్రాజెక్టుపై తెరాస ఎంపి వినోద్ కుమార్ సుప్రీం కోర్టులో కేసు వేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు.