తెలంగాణ

దండిగా కందులు.. అండగా ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 12: తెలంగాణలో ఈ ఏడాది కంది దిగుబడి పుష్కలంగా ఉంటుందని అంచనాలున్నాయని, అం దుకే పెద్దఎత్తున కందులను కొనుగోలు చేస్తున్నామని, రాష్టవ్య్రాప్తంగా 54 కేంద్రా ల ద్వారా కందులు కొంటున్నామని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 45 వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేశామని తెలిపారు. అవసరమైతే మరిన్ని కేంద్రా లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయా కేంద్రాల్లో కందుల కొనుగోలు జరిపిన వారంలోగా సంబంధిత రైతుకు బ్యాంకు అకౌంట్‌లో నేరుగా నగదు జమచేస్తామని చెప్పారు. సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ఇప్పటివరకు అక్కడ కేవలం 180 క్వింటాళ్ల కందులే కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది పంట పుష్కలంగా ఉంటే కొనుగోళ్లు ఎందుకు ఆ స్థాయిలో లేవంటూ అధికారులను ప్రశ్నించారు. వారు సరిగా పనిచేయకపోవడం వల్లే రైతులు దళారులను ఆశ్రయిస్తున్నట్టున్నారని మందలించారు. కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ప్రవీణ్, మార్కెట్ కార్యదర్శి శ్రీ్ధర్‌లకు చార్జిమెమోలు జారీ చేయాలని సంయుక్త కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సారి కంది పంట సాగు ఆశాజనకంగా ఉందని, మొత్తం 4.80 లక్షల మెట్రిక్ టన్నుల కందులు దిగుబడి అయ్యే అవకాశం ఉందన్న అంచనాల మేరకు ప్రభుత్వం మంచి మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు అనుమతించిందని, రైతు ఒక్క గింజ కూడా నష్టపోకుండా మరోమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కందులను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం క్వింటాలు కందులకు రూ.5050 మద్దతు ధరను నిర్ణయించిందని, అయినా రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారంటే అధికారులు నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 వేల మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల పనితీరును ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేస్తూండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంయుక్త కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నారు.

చిత్రం..సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లపై మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు