తెలంగాణ

ఎసిబికి చిక్కిన విజిలెన్స్ ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 12: తనిఖీల పేరుతో మిల్లర్లను బెదిరిస్తూ వారి నుండి పెద్దమొత్తాలను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజిలెన్స్ ఎస్‌పి భాస్కర్ రావు చివరకు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. గురువారం లక్ష రూపాయలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆరునెలలకు ఓసారి లక్ష రూపాయలు ఇవ్వాలంటూ వేధిస్తూండటంతో మిల్లర్ భద్రాద్రి రాములు సహా మరికొందరు ఏసిబిని ఆశ్రయించారు. పధకం ప్రకారం ఏసిబి పన్నిన వలలో ఆ అధికారి చిక్కాడు. ఎసిబి అధికారులు, మిల్లర్ భద్రాద్రి రాములు చెప్పిన వివరాల ప్రకారం పట్టణంలో 12 రైస్ మిల్లులు ఉన్నాయి. వాటిలో ఐదు మూతపడ్డాయి. మిగతావి కూడా ఏడాదిలో ఆరునెలలే పనిచేస్తున్నాయి. కానీ ఏడాదికి సరిపడా పన్నులు చెల్లిస్తున్నారు. అయినా ఏదో ఒక మిషతో డబ్బులు ఇవ్వాలని ప్రాంతీయ విజిలెన్స్ ఎస్‌పి భాస్కర్‌రావు మిల్లర్లను వేధిస్తుండేవారు. ఆరునెలలుకు ఓసారి లక్ష రూపాయలు ఇవ్వాలని లేనిపక్షంలో తనిఖీలు చేస్తామని బెదరిస్తుండటంతో ఆరుగురు మిల్లర్లు ఏసిబిని ఆశ్రయించారు. మిల్లర్ భద్రాద్రి రాములతో కలసి ఏసిబి అధికారులు వలపన్నారు. అడిగిన మొత్తం ఇస్తామంటూ భాస్కర్‌రావును నమ్మించారు. ఏసిబి అధికారుల వ్యూహం ప్రకారం గురువారం నల్లగొండ విటి కాలనీలో భాస్కర్‌రావు ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లి లక్ష రూపాయల నగదు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసిబి అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో రికార్డుల స్వాధీనం చేసుకున్నారు. దాడులు నిర్వహించిన ఏసిబి స్పెషల్ ఇనె్వస్ట్‌గేషన్ యూనిట్ బృందంలో డిఎస్పీలు సునీత, సిద్ధిఖీ, ఆజాద్, రవికుమార్, కోటేశ్వర్ రావు, ఆజాద్, అంజిరెడ్డి, మజీద్ అలీ, శ్రీ్ధర్ ఉన్నారు.

చిత్రం..విజిలెన్స్ ఎస్‌పి భాస్కర్ రావు