తెలంగాణ

నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 12: నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట దూసుకెళుతోందని, పది రోజుల్లో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరిపిన నియోజకవర్గంగా రికార్డు సృష్టించిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. త్వరలో పూర్తిగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించిన నియోజకవర్గంగా సిద్దిపేట చరిత్ర కెక్కనుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రగతిపై గురువారం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, అధికారులతో కలసి సమీక్షించిన హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నగదు రహిత లావాదేవీల సంఖ్యను పెంచటంలో భాగంగా అన్ని బ్యాంకు వర్గాల సహకారంతో సర్కార్ ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. 10 రోజులుగా సిద్దిపేట నియోజకవర్గం వ్యాప్తంగా 2.84, 843 ఆన్‌లైన్ లావాదేవీలు జరిగాయని, రూ. 55,73,24,907ల మేర అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరిగాయన్నారు. ఇందుకు సహకరించిన నియోజకవర్గం ప్రజలందరికి మంత్రి అభినందనలు తెలిపారు. క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభు త్వ శాఖలన్ని మరింత ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు, కిరాణ షాపుల్లో కాష్‌లెస్ ఊపందుకుందన్నారు. రోజు,రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో డిజిటల్ విధానంతో ప్రోత్సహించేందుకు మొబైల్ అప్లికేషన్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అంశాలపై గ్రామీణ యువత, మహిళ సంఘాలకు అధికారులే స్వయంగా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, కులవృత్తుల వారికి అవగాహన కల్పిస్తున్నామని, అలాగే నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూర్ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను త్వరలో క్యాష్‌లెస్ గ్రామాలుగా ప్రకటించేందుకు సభలను సిద్ధం చేసినట్లు తెలిపారు.