తెలంగాణ

‘నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని, అది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుందని గీతం విశ్వవిద్యాలయం ప్రొ వైస్ చాన్సలర్ ఎన్ శివప్రసాద్ ఉద్బోధించారు. డాక్టర్ రెడ్డీస్ ఉద్యోగుల స్వల్పకాలిక సాంకేతిక శిక్షణ ముగింపు ఉత్సవంలో మాట్లాడారు. 38 ఏళ్లుగా బోధనా రంగంలో పనిచేస్తున్నా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని, అలాగే విద్యార్థులు కూడా నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని అన్నారు. నేర్చుకోవడానికి అంతం అంటూ ఉండదని చెప్పారు. దేశంలో 30వేల ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 15 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని కేవలం 20 శాతం మందికి మాత్రమే ఉపాధి పొందే నైపుణ్యాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంటే దాదాపు 12 లక్షల మానవ వనరులు నిరుపయోగం అవుతున్నాయని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి ఎ రామారావు, తదితరులు పాల్గొన్నారు.