తెలంగాణ

ఇక ‘భరోసా’ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహిళల భద్రత, బాలికల సంరక్షణ కోసం ‘్భరోసా’ వెబ్‌సైట్‌ను నగర పోలీస్ కమిషనర్ కె.మహేందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను మహిళల భద్రత కోసం వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు, బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో ‘్భరోసా’ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలోని 60 పోలీస్ స్టేషన్లలో ప్రతి రోజూ ఏదో ఒక సమస్యపై ఫిర్యాదులు చేస్తున్న మహిళలు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ‘్భరోసా’ కేంద్రానికి వస్తే వారి సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
మహిళలు మానసిక ఇబ్బందులు, ఒత్తిడులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి మహిళలకు కౌనె్సలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
బాధిత మహిళలు సైఫాబాద్‌లోని హాకా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘్భరోసా’ కేంద్రంలో సంప్రదించవచ్చని మహేందర్ రెడ్డి తెలిపారు.