తెలంగాణ

ఏడాది చివరికల్లా ఇంటింటికీ మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నట్టు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటింటికి 2017 చివరికల్లా మంచినీటి కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గడువులోగానే సురక్షితమైన మంచినీటిని అందిస్తామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరికల్లా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యం మేరకు రాత్రింబవళ్లు మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో 19 ఇన్ టేక్ వెల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 12 ఇన్ టేక్ వెల్స్ పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన ఇన్ టేక్ వెల్స్ మరో రెండు వారాలలో పూర్తి అవుతాయన్నారు. మిషన్ భగీరథ కోసం మొత్తంగా 49,296 కి.మీ పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటికే 16,120 కి.మీ పైపు లైన్లు పూర్తి అయ్యాయన్నారు. మొత్తంగా 407 సంపులు నిర్మించాల్సి ఉండగా అందులో 110 సంపులు పూర్తి అయ్యాయని, జూన్ నెలాఖరుకు మరో 120 సంపుల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కాంట్రాక్టులు పూర్తి చేసిన పనులకు 35 శాతం చెల్లింపులు జరిగాయన్నారు. కచ్చితంగా గడువులోగా పనులు పూర్తి అవుతాయని ప్రశాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.