తెలంగాణ

18 కంపెనీలు 2167 కోట్ల పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టిఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 18 కంపెనీలకు మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. 2167 కోట్ల 47లక్షల రూపాయల పెట్టుబడులతో 18 కంపెనీలను ఏర్పాటుచేయనున్నారు. వీటి ద్వారా 13,817 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టిఎస్‌ఐపాస్ విధానాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. 15 రోజుల్లోనే 16 నుండి 17 శాఖలకు సంబంధించి అనుమతి పత్రాలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని, రాష్ట్ర ఆదాయం పెరగటమే కాకుండా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే 33,101 కోట్ల రూపాయలతో 1,20,169 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. గతంలో పరిశ్రమల కోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని ఇప్పుడు వారి స్వంత ధ్రువీకరణ ఆధారంగా ప్రభుత్వం ఆయా శాఖల అనుమతులు అందజేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా మెరుగైన పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసినట్టు తెలిపారు. టిఎస్ ఐపాస్ విధానం అమలులోకి వచ్చాక ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలు అందుకున్న పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ గతంలో కన్నా భిన్నంగా అధికారులే ముందుకు వచ్చి టిఎస్ ఐపాస్ ద్వారా అనుమతి పత్రాలు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందన్నారు. పరిశ్రమలు స్థాపించేవారిలో నమ్మకాన్ని కలిగించిందని అన్నారు. ఆరవ విడత అనుమతుల సందర్భంగా రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్థాపించే 18 పరిశ్రమలకు అనుమతి పత్రాలు ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టిఎస్‌ఐపాస్ యండి వెంకట నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీ సైదా, అడిషనల్ డైరెక్టర్ దేవానంద్ పాల్గొన్నారు.