తెలంగాణ

కందుల కొనుగోళ్లలో నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 13: రైతులు పండించిన కందులకు నాణ్యమైన మద్దతు ధరను ప్రకటించి మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆగ్రహించిన మంత్రి హరీష్‌రావు సూచనల మేరకు మొత్తం 16 మంది అధికారులకు చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో క్వింటా కందులకు ప్రైవేటు వ్యక్తులు చెల్లించే ధరకన్నా ప్రభుత్వ ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు మార్కెట్‌యార్డుకు రాకపోవడానికి అక్కడి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భావించిన ప్రభుత్వం సిబ్బందిపై కొరటా ఝళిపించింది. సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోని కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించిన మంత్రి మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సదాశివపేట, జహీరాబాద్, రాయికోడ్, నారాయణఖేడ్, వట్‌పల్లి, జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారు. క్వింటాలుకు రూ.5050 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. సీజన్ ప్రారంభం కాగా ప్రైవేట్ మార్కెట్‌లో 1124 క్వింటాళ్ల కందులను విక్రయించగా కొనుగోలు కేంద్రంలో మాత్రం కేవలం 180 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయడంపై ఆగ్రహానికి దారితీసింది.
బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే తక్కువగా ఉండగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధర నిర్ణయించినా రైతులు అటువైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారన్న అనుమానం మంత్రి హరీష్‌రావులో వ్యక్తమైంది. రైతులు తీసుకువచ్చే కందుల్లో తేమ శాతం అధికంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం 12 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాంటి కందులను రైతులు తీసుకువస్తే వారిలో అవగాహన కల్పించి ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చిందన్నట్లుగా సదాశివపేటలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌రావు కొనుగోళ్లు ఆశాజనకంగా కనిపించకపోవడంతో మార్కెట్ కార్యదర్శి, కొనుగోలు కేంద్రం ఇంచార్జికి చార్జిమెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉండటంతో సంబంధిత అధికారులంతా సంజాయిషీ ఇవ్వాలని మొత్తం 16 మందికీ చార్జిమెమోలను జారీ చేసారు. సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో కందులు మార్కెట్‌కు రావడానికి సమయం పడుతుందని, పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించి ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని, బహిరంగ మార్కెట్లో మధ్య దళారులకు అమ్మితే నష్టాన్ని చవిచూస్తారనే విషయంపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మొత్తంమీద కందుల కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అధికారులపై కొరడా ఝళిపించిందని చెప్పవచ్చు.