తెలంగాణ

చట్టసభల్లో రిజర్వేషన్లకోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 13: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారే తప్ప ఇవన్నీ ఇచ్చేందుకు అవకాశం ఉన్న రాజ్యాధికారం గురించి ఆలోచించటం లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇతరుల ఓట్లు ఎలా ఉన్నా బిసిల ఓట్లు బిసి అభ్యర్థులకు వేసుకుంటే విజయం తథ్యమని, అధికారం తప్పదనే విషయాన్ని గమనించాలని సూచించారు. బిసిలలో నెలకొన్న అనైక్యత కారణంగానే ఈ వర్గాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనకబడిపోతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు పోరాటం ప్రారంభించాలని, వరంగల్ నుంచే ఈ ఉద్యమం మొదలుకావాలని ఆయన పిలుపునిచ్చారు. బిసి సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. జనాభాలో సగభాగంగా ఉన్న బిసిల గురించి ఇప్పటి వరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఓట్లు బిసిలవి, సీట్లు ఆగ్రవర్ణాలవనే వైఖరి ఇప్పటి వరకు కొనసాగిందని విమర్శించారు. తక్కువ జనాభా ఉన్న ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలను పెంచడానికి పోటీపడుతున్న ప్రభుత్వాలు బిసిల గురించి పట్టించుకోవటం లేదని అన్నారు. ముస్లిం మైనారిటీలు సమష్టిగా, సమన్వయంగా ఉండటంవల్ల ప్రభుత్వాలు వారి మాట వింటున్నాయని, బిసిలలో ఇవి లోపించటంవల్ల విలువలేకుండాపోయిందని అన్నారు. బిసిలకు చట్టసభల్లో 50శాతం, స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 52శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రధాన డిమాండ్ అని, త్వరలో డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో బిసి సంక్షేమ సంఘం క్యాలెండర్‌ను ఆర్. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆవిష్కరించారు. బిసి సంక్షేమ సంఘం అర్బన్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సంఘం నాయకులు సిరికొండ సంజీవరావు, జీవన్‌గౌడ్

చిత్రం.. బిసి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్