తెలంగాణ

చరఖా ముందు కూర్చుంటే.. మహాత్ముడివి అవుతావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: చరఖా ముందు కూర్చున్నంత మాత్రాన మహాత్మా గాంధీ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు ఆమోదించరని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, ఎపి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మాజీ అధ్యక్షుడు జి. నిరంజన్ అన్నారు. భారత ఖాదీ కమిషన్ ప్రచురించిన క్యాలెండర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో ప్రచురించకుండా, ప్రధాని మోదీ ఫొటో ప్రచురించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు వౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ చరఖా ముందు గాంధీ ఫొటో కాకుండా ప్రధాని మోదీ ఫొటోను ముద్రించడం ద్వారా గాంధీని అవమానించారని విమర్శించారు. ఇందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విహెచ్ ప్రసంగిస్తూ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా అవమానిస్తున్నారని విమర్శించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తూ చరఖాతో నూలు పడుతున్న మహాత్మా గాంధీ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ కూర్చోవడాన్ని ప్రజలు సహించరని అన్నారు. ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీతో పోల్చుకోవడం ఫ్యాషన్ అయ్యిందని ఆయన విమర్శించారు. నిరంజన్ ప్రసంగిస్తూ గాంధీ స్థానంలో ప్రధాని మోదీనే కాదు ఇంకెవ్వరినీ ప్రజలు ఆమోదించరని తెలిపారు. ప్రధాని మోదీకి మహాత్మా గాంధీ పట్ల గౌరవం ఉంటే వెంటనే చరఖాతో ఉన్న తన ఫొటోలను తొలగించాలని ఖాదీ కమిషన్‌ను ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రజల మనసుల నుంచి గాంధీని తొలగించాలని ప్రయత్నిస్తున్నారని నిరంజన్ విమర్శించారు.

చిత్రం..గాంధీ విగ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ నేతల వౌన దీక్ష