తెలంగాణ

ముత్తూట్ చోరీలో ముంబయి మాఫియా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టించిన హైదరాబాద్ శివారులోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ చోరీ వెనుక ముంబయి మాఫియా డాన్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ముత్తూట్ చోరీ సూత్రధారి లక్ష్మణ్‌తోపాటు ఐదుగురు నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు ఇటీవల కర్నాటకలోని గుల్బర్గాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముత్తూట్ ఫైనాన్స్, బ్యాంక్‌లను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడే ఈ గ్యాంగ్ మొత్తం ఐదు ముత్తూట్ ఫైనాన్స్ చోరీల్లో నిందితులని పోలీసులు నిర్ధారించారు. ముత్తూట్ చోరీల వెనుక ముంబయి మాఫియా డాన్ చోటారాజన్, అజీజ్‌రెడ్డి గ్యాంగ్‌తో ఈ ముఠాకు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు లక్ష్మణ్, విజయ్, పాటిల్, షా, సుభాశ్ జైల్లో ఉన్నప్పటికీ పరిచయాలతో వారిని విడిపించడంలో చోటారాజన్, అజీజ్‌రెడ్డిలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు దొంగలను చేరదీసి తర్ఫీదు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముత్తూట్ వంటి దోపిడీలు చేయాలంటే పెద్ద నెట్‌వర్కును నడిపించే మాఫియా డాన్ హస్తం ఉంటేనే సాధ్యమవుతుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇదిలావుండగా ఈ ఐదుగురు ముఠా చేసిన చోరీలిలా ఉన్నాయి.
2015 ఫిబ్రవరి 4: రామచంద్రాపురం పరిధిలోని బీరంగూడ ముత్తూట్ మినీ ఫైనాన్స్ కంపెనీలో పట్టపగలే చోరీ చేశారు. ఐదుగురు దుండగులు బంగారం తాకట్టు పెడతామంటూ లోపలికి ప్రవేశించి 4 కేజీల బంగారం, 86 వేల నగదు దోచుకెళ్లారు. కెమెరాలకు చిక్కకుండా డివిఆర్‌ను ఎత్తుకెళ్లారు. కాగా అప్పట్లో ఈ దోపిడీని సిమి ఉగ్రవాదులు చేసినట్టు పోలీసులు అనుమానించారు.
2015 మే 29: కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ చర్మాస్ సమీపంలోని ముత్తూట్ మినీలో నలుగురు దుండగులు ప్రవేశించి లాకర్ తాళాలు తీయాలని సెక్యూరిటీ గార్డును బెదిరించారు. మేనేజర్ లేడని సిబ్బంది వారించడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
2016 మే 16: కర్నాటకలోని కల్బుర్గిలో 26 కేజీల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. 2016 డిసెంబర్ 26న బీరంగూడ చోరీకి రెండు రోజుల ముందు గుజరాత్‌లోని ధారోజీలో ముత్తూట్ ఫైనాన్స్‌లో 4.5 కేజీల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
మొత్తం మీద ముత్తూట్ ఫైనాన్స్‌లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో నేరగాళ్లు పాల్పడిన చోరీలు బయటపడ్డాయి.