తెలంగాణ

మన సంస్కృతిని మరవొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: యువత పాశ్చాత్య మోజులో పడిపోయి మన సంస్కృతిని, మన పండుగలను మరిచిపోతోందని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను విడనాడకూడదని ఆయన యువతకు ఉద్బోధించారు.
నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో తలసాని పతంగులను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన సంస్కృతికి సంబంధించిన ఉత్సవాలు బతుకమ్మ, బోనాలు, పతంగుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. టూరిజం శాఖ ఆగాఖాన్ అకాడమీలో నిర్వహిస్తున్న కైట్స్ ఫెస్టివల్‌కు 18 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, దైవజ్ఞ శర్మ, కార్పొరేటర్ విజయారెడ్డి, శేషుకుమారి, పులి జగన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో పతంగులను ఎగురవేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్