తెలంగాణ

కుటుంబ కలహాలతో చెరువులో పడి ముగ్గురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, జనవరి 15: సంక్రాంతి పండుగ రోజు అంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటుండగా కుటుంబ కలహాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి సుభాష్ (40), భార్య అనుసమ్మ (30), కుమారుడు జ్ఞానేశ్వర్ (13) గ్రామానికి సమీపంలోని విశ్వనాథం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. వారి కథనం ప్రకారం...మృతుల్లో ఒకరైన సుభాష్ తల్లి రామమ్మ, కోడలు అనుసమ్మ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ కలహాలతో అనుసమ్మ తాను ఆత్మహత్య చేసుకుంటానని గ్రామ సమీపంలోని విశ్వనాథం చెరువు వద్దకు పరుగులు తీయగా భర్త సుభాష్, కుమారుడు జ్ఞానేశ్వర్ కూడా వెంట పరుగెత్తగా చెరువు వద్దకు రాగానే అనుసమ్మ చెరువులో దూకడంతో వెంటనే భర్త సుభాష్ కూడా భార్యకోసం చెరువులో దూకాడు. కాగా, ఇద్దరు బయటకు రాకపోవడంతో కుమారుడు జ్ఞానేశ్వర్ కూడా తల్లిదండ్రుల కోసం చెరువులో దూకాడు. మృతుల్లో ఒకరైన తలారి సుభాష్‌కు ఈత రాకపోవడంతో భార్యను రక్షించుకునేందుకు వెళ్లి తాను కూడా మృతి చెందాడు. తల్లిదండ్రుల కోసం కొడుకు ఒకేసారి ముగ్గురు చెరువులో పడి మృత్యువాత పడ్డారు. వీరి వెంట వెళ్లిన 7, 3 సంవత్సరాల వ యసున్న ఇద్దరు కుమార్తెలు చెరువు గట్టుపై చూస్తూ రోదిస్తున్నారని, వీరిద్దరూ గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో గ్రామస్థులు ఒక్కసారిగా చెరువు వద్దకు చేరుకొని ఈ ముగ్గురు శవాలను వెతికి బయటకు తీశారు. ఇదిలావుండగా మృతి చెందిన అనుసమ్మ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అని గ్రామస్థులు తెలిపారు. భార్యాభర్తలు, కుమారులు అత్త రామమ్మ కూడా అంతా అన్యోన్యంగా కలిసిమెలసి ఉండేవారని పండుగ రోజు వచ్చిన చిన్న కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. జ్ఞానేశ్వర్ హత్నుర మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. పండుగ సెలవుల కోసం వచ్చి తల్లిదండ్రుల వెంట తాను కూడా పరలోకానికి వెళ్లాడని గ్రామస్థులు రోదిస్తూ తెలిపారు. చిన్న తగాద వల్ల పండుగ రోజు ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను కలిచివేసింది. అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుకున్నారు.

చిత్రం..అల్లాదుర్గం మండలం రాంపూర్ చెరువులో పడి మృతి చెందిన భార్యాభర్తలు, కుమారుడు