తెలంగాణ

ఎఫ్‌ఎం రేడియో వార్తలతో భద్రతా సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: దేశంలో ప్రైవేట్ రంగంలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ద్వారా వార్తల ప్రసారానికి అనుమతించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదాలు లేకపోలేదని ప్రసార భారతి చైర్మన్ ఏ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లకు వార్తల ప్రసారానికి అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వం దీని వల్ల తలెత్తే పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య కోణంలో ఆలోచిస్తే, ఎఫ్‌ఎం రేడియోలకు వార్తల ప్రసారాల అనుమతి ఇవ్వడం సులువుగా కనపడుతుందన్నారు. కాని దేశంలో నెలకొన్న వైవిధ్యమైన పరిస్థితులు, అంతరంగిక భద్రత దృష్ట్యా ఎఫ్‌ఎంల ద్వారా వార్తల ప్రసారమనేది ఆందోళన కలిగిస్తుందన్నారు. త్వరలో కొత్త ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ప్రారంభించేందుకు వీలుగా బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీని ప్రభుత్వం వేలం వేసిందన్నారు. ప్రైవేట్ టీవీ చానళ్లకు అనుమతి ఇవ్వడం వేరని, అదే ఎఫ్‌ఎం రేడియోలు వార్తలుప్రసారం చేయడం ఒక సవాలు అన్నారు. రేడియోలకు ఉండే శ్రోతలు వేరుగా ఉంటారన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లను కార్పొరేటీకరణ చేయడం, ప్రభుత్వంపై ఆధారపడడం మానివేసి సొంతంగా నిధులు సమకూర్చుకుని పటిష్టం చేసే ప్రతిపాదనలపై ఆయన మాట్లాడుతూ, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ప్రసారభారతిలో ఆకాశవాణి, దూరదర్శన్ భాగమన్నారు. ప్రసారభారతి నుంచి ఆకాశవాణి, దూరదర్శన్‌ను విడదీసేముందు ప్రసారభారతి చట్టాన్ని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. డిటిహెచ్ ప్లాట్ ఫారంను విస్తరించే యోచనలో దూరదర్శన్ ఉందని ప్రసారభారతి డైరెక్టర్ జనరల్ సుప్రియ సాహు అన్నారు. కొత్తతరహా సెట్‌టాప్ బాక్సులను ఎంపిఇసి 4 టెక్నాలజీతో రూపొందించి 104 చానల్స్‌ను మార్చి నెలాఖరులోపల ప్రసారం చేసేందుకు కసరత్తును చేపట్టామన్నారు.